Sunday, April 17, 2016

మనసులో బాధ..మనసులో బాధ..
నీకు చెప్పుకుందామంటే
గొంతు మూగబోయింది!
కనీసం,
కన్నీళ్ళకైనా
మాటలొస్తే
బాగుణ్ణు!!!

-----భాస్కరభట్ల

వీధి దీపం !!
చీకటి చూరుకి
వేలాడుతున్న 
వెలుతురు ఖడ్గం 
వీధి దీపం !!

--భాస్కరభట్ల 

Friday, February 14, 2014

తలగడ!!

ఎన్నిసార్లు
కన్నీళ్ళను
మింగిందో?

ఎన్నిసార్లు
కౌగిట్లో
నలిగిందో? 
తలగడ!! 

---భాస్కరభట్ల

Sunday, December 30, 2012

వడ్డించిన విస్తరి


ఎవరి జీవితమూ
వడ్డించిన విస్తరి కాదు!
అవును..
ఇప్పుడన్నీ
బఫే పార్టీలే కదా..?

----భాస్కరభట్ల

Friday, November 23, 2012

మబ్బులు
ఏకుతున్న దూది,
ఆకాశంలో
ఎగిరిపోతున్నట్టు
మబ్బులు
వాహ్!!
------భాస్కరభట్ల

Wednesday, November 14, 2012

అనాధపిల్లలు!!


ప్చ్...
హుండీలో వేసిన
అజ్ఞాత భక్తుడి
కానుకలాగ....
అనాధపిల్లలు!!

---భాస్కరభట్ల  

Friday, October 26, 2012

సంస్కారం..వెతికే సంస్కారం..
ఆఖరికి...
ఉతికే సబ్బుల్లోనా?

------భాస్కరభట్ల