Saturday, June 25, 2011

పొగమబ్బులెక్కడివీ?















ఆకాశం
అదేపనిగా
ఎన్నిసిగరెట్లు కాలుస్తోందో ఏమో..
లేకపోతే
ఇన్ని పొగమబ్బులెక్కడివీ?

-----భాస్కరభట్ల

Tuesday, June 7, 2011

తనూ పసిపాపే !















ఆదమరిచి.. అమాయకంగా
నిదరోతున్న
నా పిల్లల మధ్య..
తనూ ఓ పసిపాపలానే
కనిపిస్తోంది
మాఆవిడ!!!

----------భాస్కరభట్ల

Wednesday, June 1, 2011

నా పని!














నువ్వు గాలివి
నేను చెట్టుని

నువ్వేమన్నా తల ఊపడమే
నా పని!

----భాస్కరభట్ల