Wednesday, June 16, 2010

వెలితి!




రోజూలానే రెప్పల్ని విరుచుకుంటూ
నిద్ర పక్షి ఎగిరిపోతుంది...
కాఫీ కప్పును మోసుకొచ్చే
గాజుల గలగలలు మాత్రం వినబడవు!
బాత్రూంలో వేణ్ణీళ్ళు,
టిఫిన్ చేసి వెళ్ళమనే వేడుకోళ్ళు వినిపించవు!
ఫాలిష్ తో మెరిసే షూలు,
ఇస్త్రీ బట్టలు ఎదురుపడవు!
స్కూటర్‌ స్టార్ట్ చేసి..
వీధి మలుపుదగ్గర కనుమరుగయ్యే వరకూ
టాటా చెబుతూ ఏ చేతులూ గాలిలో ఆడవు!
ఏచూపులూ వెన్నంటి రావు!
ఆఫీసుతో ఎనిమిది గంటల సంసారం సాగించి
సాయంకాలవేళ ఇంటికి చేరితే
మల్లెపూలపొట్లాం కోసం గోముగా నడిచివచ్చే
పాదమంజీరధ్వనులు దరిచేరవు!
ఇంట్లో స్టవ్,గిన్నె వగైరాలు
శెలవు దొరికాయని సంబరపడతాయి!
ఎలకలు మీసాలు మెలేస్తాయి!
సంభాషణలుండవు..
సంఘర్షణలుండవు..
నిట్టూర్పులుండవు..
నిబిడాశ్చర్యాలూ వుండవు..

డబల్‌కాట్ మీద ఓ దిండు ఖాళీగా కనిపించి
మనసు నలిగిపోతుంది!
మనసులాగే ఇల్లు ఇల్లంతా వెలితే!
శ్రీమతి ఎప్పుడైనా పుట్టింటికి వెళితే!!!!!!

----భాస్కరభట్ల

16 comments:

Fun Counter said...

Ghazal Srinivas gari _ Nenu Naa Illu loa paaTa gurthosthondi..Illu ipudu Illu laa lene ledu..voorininchi tanu inka rane ledu..http://www.chitramala.com/audio-songs/pop_new.php?sid=8462&wid=1265&mode=0&rand=0.623705185286567

venkat makina said...

Excellent... Sir

Chaitanya Sharma Yamijala said...

మనసులాగే ఇల్లు ఇల్లంతా వెలితే!
శ్రీమతి ఎప్పుడైనా పుట్టింటికి వెళితే!!!!!!
"illu illantha " rendusarlu illu enduku vadavu anna? Naaku ardham kaledu dani avasaram.

Anonymous said...

Chalaaaaaaaaaaaaaaaaaaa bagundi... :) :)
Simply awesome...!!! :)

manasulo maata.......! said...

chala bhagundhi.....naku inka pelli kaledhu leni ayina tharvatha srimathi puttintiki velthey ela vuntundho kallaki kattinattu choopincharu me kavitha dwara....chala bhagundhi andi.

ani said...

elaa restful gaa ....?:)Clear visual presented!

Meher Shriram said...

superb

Unknown said...

yenta bavundandiiii....ఇంట్లో స్టవ్,గిన్నె వగైరాలు
శెలవు దొరికాయని సంబరపడతాయి!
ఎలకలు మీసాలు మెలేస్తాయి!..sooooooo nice..మనసులాగే ఇల్లు ఇల్లంతా వెలితే!
శ్రీమతి ఎప్పుడైనా పుట్టింటికి వెళితే!!!!!!

Unknown said...

Ravi chalabagundi kani nijanga srimathi puttinintiki pothe ettlaga undedhi evaru...? aha na pellam puttintiki poendoch ani chala santoshapadataru mee maga purushulu...any way mee bhava kavitha naku baga nachindi...kaneesam uohallo nyna chala bagundi...

ajaY vegeSna said...

Hi Sir, It seems to be a very personal experience for you. Nice One, indeed :)

Unknown said...

hi..idhi chadivina tarvatha pelli chesukovaalanipisthundhi...bhayya..arjun(jayanth gari AD )

Sky said...

భాస్కరభట్ల గారు,

నమస్కారం. బ్లాగు మొదలుపెట్టినందుకు అభినందనలు. మీ బ్లాగ్ కూడా గొల్లపూడి మారుతీరావు గారి బ్లాగ్ లాగా ప్రాచుర్యం పొందాలని ఆశిస్తున్నాను. మీరు చెప్పగానే బ్లాగ్ చూడలేకపోయాను. ఇప్పుడే కాస్త సమయం చిక్కితే ఇటువైపు వచ్చాను. పాదముద్రలు బ్లాగ్ చాలా బాగుంది. టెంప్లెట్ ని మరింత అందంగా, బ్లాగ్ థీం కి తగ్గట్టుగా మార్చితే ఇంకా బాగుంటుంది అని అనిపిస్తోంది. ఈ విషయమై మీకు సహాయం కావాలంటే నేను చేయగలుగుతాను.

వెలితి- కవిత చదువుతుంటే మిత్రులు గజల్ శ్రీనివాస్ గారి "ఇల్లు ఇపుడు ఇల్లులాగ లేనే లేదు" పాట గుర్తుకువచ్చింది. సరళమైన భాషలో గొప్ప భావాన్ని వ్యక్తపరిచారు. నాకింకా పెళ్ళి కాకపోయినా అప్పుడే మా ఆవిడ పుట్టింటికి వెళ్ళినట్టు అనిపించింది :) ఆషాఢం ఎఫెక్ట్ అనుకుంతాను. నిజమే ఎవరో కవి చెప్పినట్టు దాంపత్యం లాంటి మైత్రి లేనేలేదు.

ఇలాగే మరిన్ని కవితలను మాకు వినిపిస్తారని ఆశిస్తూ,

భవదీయుడు,

సతీష్ కుమార్ యనమండ్ర
(ఈ-తెలుగు)

సురేష్ వంగూరి said...

wonderful sir.

AnilPendela said...

wht to say about this...too cute....I Love my wife .. i can't live with out her..thts y i am also went to my Aunti's house with her......wow wht a feeling.. superb Bhskar ji..

TELUGU MEDIA said...

nijame sir...aa vedana mee kavita choosthe marintha perugutundi...kalla mundu bharya leka photo cell phone lo enni gantalu matladi emi labham..ame premato choose choopu...talli la pette mudda karave kadaa...

గాయత్రి said...

chaalaa chaala baagundi...
mee blog lo pratee post bagundi..