Wednesday, June 2, 2010

శత్రువు!


సిగరెట్ కాల్చే అలవాటున్నందుకు
నన్ను నేనే తిట్టుకున్నాను.
అదేదో అరోగ్యానికి హానికరమని కాదు!
నీ ధ్యాసలోపడి
మైమరచిపోతుంటే...
నా ఆలోచనల్ని చెడగొట్టిందీ..
విలన్‌లా అడ్డుపడిందీ..
చేతివేళ్లమధ్య చుర్రుమన్న
ఆ సిగరెట్టే!

----భాస్కరభట్ల

2 comments:

ani said...

manchi logic,sir :)

Sky said...

భాస్కరభట్ల గారు,
మన గురువుగారు సిరివెన్నెల గారు అన్న మాటలు ("చీపుగ చూడకు పొరపాటు,
చిరాకు పడదా సిగరెట్టు") పరిచిపోయారా ఏమిటి???

లాభం లేదు సర్- మీకు ఇదే నా శాపం.... ఓ అర్ధ రాత్రి మీకు పాట రాస్తూ నిద్ర పట్టని క్షణాన సిగరెట్లు అయిపోవాలి :) :) :)

సతీష్ కుమార్ యనమండ్ర