పాదముద్రలు
అడుగులు సాగిపోయినా, జ్ఞాపకాల పాదముద్రలు పదిలమే!
Sunday, April 17, 2016
మనసులో బాధ..
మనసులో బాధ..
నీకు చెప్పుకుందామంటే
గొంతు మూగబోయింది!
కనీసం,
కన్నీళ్ళకైనా
మాటలొస్తే
బాగుణ్ణు!!!
-----భాస్కరభట్ల
వీధి దీపం !!
చీకటి చూరుకి
వేలాడుతున్న
వెలుతురు ఖడ్గం
వీధి దీపం !!
--భాస్కరభట్ల
Friday, February 14, 2014
తలగడ!!
ఎన్నిసార్లు
కన్నీళ్ళను
మింగిందో
?
ఎన్నిసార్లు
కౌగిట్లో
నలిగిందో
?
తలగడ
!
!
---
భాస్కరభట్ల
Sunday, December 30, 2012
వడ్డించిన విస్తరి
ఎవరి జీవితమూ
వడ్డించిన విస్తరి కాదు!
అవును..
ఇప్పుడన్నీ
బఫే పార్టీలే కదా..?
----భాస్కరభట్ల
Friday, November 23, 2012
మబ్బులు
ఏకుతున్న దూది,
ఆకాశంలో
ఎగిరిపోతున్నట్టు
మబ్బులు
వాహ్!!
------భాస్కరభట్ల
Wednesday, November 14, 2012
అనాధపిల్లలు!!
ప్చ్...
హుండీలో వేసిన
అజ్ఞాత భక్తుడి
కానుకలాగ....
అనాధపిల్లలు!!
---భాస్కరభట్ల
Friday, October 26, 2012
సంస్కారం..
వెతికే సంస్కారం..
ఆఖరికి...
ఉతికే సబ్బుల్లోనా?
------భాస్కరభట్ల
Wednesday, October 3, 2012
తప్పిపోయింది...
మా ఊరు
తప్పిపోయింది...
ఫ్లై-ఓవర్ వచ్చి!!!
----భాస్కరభట్ల
Wednesday, September 19, 2012
ఇద్దరం..
ఇద్దరం..
మధ్యలో మరికొందరు..
మళ్ళీ మనిద్దరమే!!!
-------భాస్కరభట్ల
Friday, September 14, 2012
పుస్తకాలేవీ?
చెదపురుగులకి
తిండి కొరత...
పుస్తకాలేవీ?
-----భాస్కరభట్ల
అలా కాదు మమ్మీ...ఇలా!
అలా కాదు మమ్మీ...ఇలా!
పిల్లని వెక్కిరిస్తోంది...
గుడ్డు!!
-----భాస్కరభట్ల
model: samhitha
Wednesday, September 12, 2012
రెండుముక్కలయ్యింది...
లైఫ్‌బాయ్ సబ్బు
రెండుముక్కలయ్యింది...
ఓ మధ్యతరగతి జ్ఞాపకం!
------ భాస్కరభట్ల
Tuesday, September 4, 2012
నేను భూమి..
నాన్న సూర్యుడు..
నేను భూమి..
అమ్మ ఓజోన్ !!
-------భాస్కరభట్ల
Wednesday, August 29, 2012
తెల్లారిందనడానికి...
తెల్లారిందనడానికి...సింబాలిగ్గా
ఇప్పుడు
కోడికూతలెక్కడ?
అన్నీ కుక్కర్ కూతలే!!
-----భాస్కరభట్ల
Tuesday, May 15, 2012
శీల పరీక్ష
సొరకాయకి
శీల పరీక్ష
పాపం...ఒళ్ళంతా గాయాలే!!
------భాస్కరభట్ల
Wednesday, November 16, 2011
మనసెప్పుడూ ఇంతే...
ఈ మనసెప్పుడూ ఇంతే...
ఇచ్చేదాకా
ఏడుస్తుంది!
ఇచ్చేశాక..
ఏడిపిస్తుంది!!
----భాస్కరభట్ల
Wednesday, November 2, 2011
మనసులో బాధ..
మనసులో బాధ..
నీకు చెప్పుకుందామంటే
గొంతు మూగబోయింది!
కనీసం...
కన్నీళ్ళకైనా
మాటలొస్తే
బాగుణ్ణు!!!
-----భాస్కరభట్ల
Friday, October 7, 2011
వెన్నెల మరకలు !!!
పైనుంచి
ఎవరో
పాలగిన్నె
ఒంపేసినట్టు...
నేలమీద
ఎన్ని వెన్నెల మరకలో!!!
-------భాస్కరభట్ల
Monday, September 5, 2011
వెక్కిరిస్తోంది....
ఊరెళ్ళిన
మా ఆవిడని
పదే పదే గుర్తుచేస్తూ
వెక్కిరిస్తోంది....
అద్దంమీద బొట్టుబిళ్ళ!!!
----భాస్కరభట్ల
Friday, July 29, 2011
పలికిస్తున్నాను!!!
నీ కోసం
చూపుల పియానోపై
నిరీక్షణరాగాల్ని
పలికిస్తున్నాను!!!
----భాస్కరభట్ల
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)