'వాక్యం రసాత్మకం కావ్యం' అన్న మాటకు అక్షర దర్పణాలు భాస్కరభట్ల కవితా వాక్యాలు అనుభవ సాంద్రత అనుభూతి గాఢత కలగలిపిన ఆణిముత్యాలు ఇవన్నీ.....
ఒక వాక్యాన్ని సుభాషితంగా, సూక్తిగా, సామెతగా, నిత్యసత్యంగా మార్చగల అద్భుత 'కల' విన్యాసం వీటిలో కనిపిస్తుంది.
ఎంత నూనె వున్నా... వత్తి లేకుండా అది దీపం కాదు. అలాంటి వత్తులే ఇవన్నీ... ఎంత భాష వచ్చినా అందుకే అందరూ ఇలాంటివి రాయలేరు. కవిత్వానికి కావలసిన ప్రాథమిక లక్షణాలు (అవతరణం- అన్వేషణం-ఆరోహణం- అవధారణం-అనురూపణం-అభిభాషణం) అన్నీ ఒక్కో వాక్యంలో జొప్పించి రాయడం... కేవలం ప్రజ్ఞ అన్న చిన్న మాటతో సరిపుచ్చలేను.
ఇలా రాయగలగటం అక్షర సాక్షాత్కారం.. ఆత్మ సంస్కారం. కవితా సృష్టికి కావలసిన తపోనిష్ట ఇందులో కనిపిస్తుంది. ఇదే ఫోర్త్ డైమన్షన్.
పసిడి రేకులు పరచిన.. కవితా అవనిలో... ఒంటిరిగా కాళ్లు సాచి నడిచే ఒంటెలా ప్రతీ వాక్యంలో నా పాద ముద్రలను... నేను ఫొటో తీసుకుని చూసుకుంటూ నడిచిన అనుభవం పొందాను. దీన్నే కవితా సాక్షాత్కారం అంటారేమో....
ఆ స్థాయిలో నా సంస్కారాన్ని మరింత పెంచిన.. మీ అక్షర ప్రతిభకు నమస్కారం తెలుపుతూ...
3 comments:
nijmagaaaa kevvu keka
.....ఆత్మకు పాస్ పోర్ట్ ఫొటో.....
'వాక్యం రసాత్మకం కావ్యం' అన్న మాటకు అక్షర
దర్పణాలు భాస్కరభట్ల కవితా వాక్యాలు
అనుభవ సాంద్రత అనుభూతి గాఢత కలగలిపిన
ఆణిముత్యాలు ఇవన్నీ.....
ఒక వాక్యాన్ని సుభాషితంగా,
సూక్తిగా,
సామెతగా,
నిత్యసత్యంగా మార్చగల అద్భుత 'కల' విన్యాసం
వీటిలో కనిపిస్తుంది.
ఎంత నూనె వున్నా...
వత్తి లేకుండా అది దీపం కాదు.
అలాంటి వత్తులే ఇవన్నీ...
ఎంత భాష వచ్చినా అందుకే అందరూ
ఇలాంటివి రాయలేరు.
కవిత్వానికి కావలసిన
ప్రాథమిక లక్షణాలు (అవతరణం- అన్వేషణం-ఆరోహణం- అవధారణం-అనురూపణం-అభిభాషణం)
అన్నీ ఒక్కో వాక్యంలో జొప్పించి రాయడం...
కేవలం ప్రజ్ఞ అన్న చిన్న మాటతో సరిపుచ్చలేను.
ఇలా రాయగలగటం అక్షర సాక్షాత్కారం..
ఆత్మ సంస్కారం.
కవితా సృష్టికి కావలసిన తపోనిష్ట
ఇందులో కనిపిస్తుంది.
ఇదే ఫోర్త్ డైమన్షన్.
పసిడి రేకులు పరచిన..
కవితా అవనిలో...
ఒంటిరిగా కాళ్లు సాచి నడిచే ఒంటెలా
ప్రతీ వాక్యంలో నా పాద ముద్రలను...
నేను ఫొటో తీసుకుని చూసుకుంటూ
నడిచిన అనుభవం పొందాను.
దీన్నే కవితా సాక్షాత్కారం అంటారేమో....
ఆ స్థాయిలో నా సంస్కారాన్ని మరింత పెంచిన..
మీ అక్షర ప్రతిభకు నమస్కారం తెలుపుతూ...
అక్షరాభిమాని
వల్లూరి రాఘవరావు
chmapesaru sirr..okka mukkaloo
Post a Comment