పాదముద్రలు
Thursday, August 26, 2010
తలకిందులు!
అన్నప్రాశనలో..
పిల్లాడు... కత్తి ముట్టుకుంటే
హడలిపోయారు అందరూ
హంతకుడవుతాడని!
కానీ,
పెద్దయ్యాక
అతని ఇంటిముందు
వెలిసింది బోర్డు
మాస్టర్ ఆఫ్ సర్జన్ అనీ..
ఆపరేషన్ స్పెషలిష్టనీ!!!
---భాస్కరభట్ల
Friday, August 6, 2010
నాన్న!!!
మానాన్న ప్రతీరోజూ బుధ్దుడే..
మా అందరినీ గాఢనిద్రలో వదిలేసి
తనొక్కడే మెలకువ రాగం పాడుకుంటూ
వెళిపోతాడు...
నైట్‌డ్యూటీకి!
----భాస్కరభట్ల
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)